telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఓటిటి బాటలో “రొమాంటిక్”?

Romantic

పూరి జగన్నాథ్ కుమారుడు పూరి ఆకాష్ హీరోగా ‘రొమాంటిక్’ పేరుతో ఓ కొత్త సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను యువ డైరెక్టర్ అనిల్ పాదూరి డైరెక్ట్ చేస్తున్నాడు. ఆకాష్ పూరికి జంటగా ఉత్తరాది భామ కేతిక శర్మ నటిస్తోంది. రమ్యకృష్ణ ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. హిందీ నటుడు మకరంద్ దేశ్ పాండే కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయట. కాగా త్వరగా పూర్తి చేసి సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందట. ఈ సినిమా మాఫియా నేపథ్యంలో ఓ ప్రేమ కథగా తెరకెక్కనుందట. మరి ఈ సినిమాతోనైనా ఆకాష్ పూరికి హిట్ వస్తోందేమో చూడాలి. యంగ్ డైరెక్టర్ అనిల్ పాదూరి డైరెక్షన్ లో రాబోతున్న ఈ చిత్రం మాఫియా నేపథ్యంలో ఓ ప్రేమ కథగా తెరకెక్కుతుంది.

Related posts