telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఒంటిపై నూలు పోగు లేకుండా అమలాపాల్… “ఆమె” టీజర్

Amalapaul

రత్నకుమార్ దర్శకత్వంలో అమలాపాల్ హీరోయిన్ గా రూపొందుతున్న చిత్రం “ఆమె”. తమిళంలో “ఆడై” టైటిల్ తో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను వీ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తుండగా చరిత చిత్ర, తమ్మారెడ్డి భరద్వాజలు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ కొంత సేపటి క్రితమే విడుదలైంది. ఈ టీజర్ పై, టీజర్లో అమలాపాల్ నటనపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ టీజర్‌లో ఓ తల్లి తప్పిపోయిన తన కూతురి కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు చేస్తుంది. ఆ తరువాత అమలాపాల్ దారుణమైన స్థితిలో పోలీసులకు కనిపించడం మొదలైన సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. టీజర్ చివర్లో అమలాపాల్ ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా కన్పించి అందరికీ షాకిచ్చింది. నిజంగా ఇలాంటి పని చేయడానికి ఎంతో ధైర్యం కావాలి. ఇక ఈ టీజర్ పై సమంత స్పందిస్తూ “ఆడై” టీజర్ ప్రేక్షకులకు అత్యంత ఉత్కంఠ కలింగించేలా, అద్భుతంగా ఉంది, బెస్ట్ విషెస్ టు అమలాపాల్, సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాను” అంటూ ట్వీట్ చేసింది.

 

Related posts