telugu navyamedia
సినిమా వార్తలు

10 గంటల వ్యవధిలో  చిత్రీకరణ పూర్తి ..

“వైట్ పేపర్” చిత్రాన్ని  కేవలం 10 గంటల వ్యవధిలో  చిత్రీకరణ పూర్తి చేసుకోవడంతో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు అరుదైన చిత్రంగా సత్కరించారు. త్వరలో గిన్నిస్ బుక్ రికార్డ్స్ లలో కూడా ఎక్కబోతుంది ఈ చిత్రం.

చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడాలు లేవు. కథ బాగుండి ప్రేక్షకులను ఆకట్టుకునే ఏ సినిమా అయినా పెద్ద సినిమాయే. తమి ళంలో ‘స్వయంవరం’ సినిమాను 24 గంటల్లో పూర్తి చేశాం. పది గంటల్లోనే ‘వైట్‌ పేపర్‌’ను పూర్తి చేసిన టీమ్‌కి నా అభినందనలు. అభి హీరోగా నటించిన ఈ సినిమా హిట్‌ కావాలి’’ అని ప్రముఖ నటి, నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు.

రోజా గారు ఎంతో బిజీగా ఉన్నా కూడా మా కోసం వచ్చి మా టీజర్ ను విడుదల చేసేందుకు వారికి మా ధన్యవాదాలు.దర్శకుడు నన్ను కలసి మంచి థ్రిల్లర్ కథ చేద్దాం.ఇప్పటి వరకు ఎవరు చేయనటువంటి విధంగా 10 గంటల్లో సినిమాను పూర్తి చేద్దాం అన్నాడు. మేము ఈ ప్రాజెక్టు ను ఛాలెంజింగ్ గా తీసుకుని ప్రీ ప్లాన్డ్ గా మేము ముందే రిహార్సల్ చేసుకున్నాము.షూట్ లోకి వెళ్లిన తరువాత  టైం డిలే కాకూడదని 4 కెమెరాలతో షూట్ చేయడం జరిగింది. 10 గంటల్లో సినిమాను పూర్తి చేస్తే ఔట్ ఫుట్ ఎలా వచ్చింది అనే అనుమానం అందరికి వస్తుంది.షూట్ పూర్తి అయిన తరువాత మొత్తం ట్రిమ్ చేస్తే రెండు గంటల ఫ్యూచర్ ఫిలిం లాగా రూపొందించాము.ఈ సినిమాను ఒకె లోకేషన్ లో జరిగే ఫోన్ బూత్,7500  వంటి సినిమాలు హాలీవుడ్లో వచ్చాయి.కానీ తెలుగులో, ఇండియాలో కూడా ఇప్పటివరకు 10 గంటల్లో పూర్తి చేసిన సినిమాలు రాలేదు.ఇప్పుడు మేము తీసిన మా చిత్రం నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంద‌ని అభి అన్నారు.

అదిరే అభి, అభినయ కృష్ణవాణి, తల్లాడ సాయికృష్ణ, స్నేహ, నందకిశోర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వైట్‌ పేపర్‌’. శివ దర్శకత్వంలో శివ ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను రోజా విడుదల చేశారు. ‘‘నాలుగు కెమెరాలతో ఈ సినిమాని షూట్‌ చేశాం. మా ప్రయత్నానికి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ వారు సత్కరించారు. త్వరలో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో ఎక్కనుంది’’ అన్నారు.

Related posts