telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

‘వరుడు కావలెను’ వచ్చేది ఎప్పుడంటే..?

సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న సినిమా ‘వరుడు కావలెను’. యంగ్ హీరో నాగ శౌర్య, రీతు వర్మ జంటగా ‘లక్ష్మీ సౌజన్య’ ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్నచిత్రం ఇది. ఇప్పటికే విడుదలైన వీడియోలో నాగశౌర్య, రీతు వర్మ జంట ఎంతో అందంగా కనిపించారు. విశాల్ చంద్రశేఖర్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. కాగా నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా సంక్రాంతి శుభాకాంక్షలతో పోస్టర్ ను విడుదల చేస్తూ సమ్మర్ లో ‘వరుడు కావలెను’ రిలీజ్ కాబోతుందంటూ తెలిపారు. కాగా, విజయ్ దేవరకొండతో ‘పెళ్లి చూపులు’తో ఆకట్టుకున్న ‘రీతూ వర్మ’.. నాగశౌర్యతో ‘వరుడు కావలెను’ అంటూ వస్తుంది. ఇలాంటి క్లాసికల్ టైటిల్స్ రీతువర్మకు బాగా కలిసొస్తుందనే చెప్పాలి. ఇక నాగశౌర్య కూడా పెద్ద హిట్ అందుకోక చాలానే రోజులు అవుతుంది. ప్రస్తుతం వీరిద్దరి కెమిస్ట్రీ చూస్తుంటే ‘వరుడు కావలెను’ సినిమాపై అంచులఞ్చ పెరిగిపోతున్నాయి. చూడాలి మరి ఈ సినిమా అభిమానులను ఆకట్టుకుంటుందా… లేదా అనేది.

Related posts