telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రజినీకాంత్ .. తమిళుడు కాదు.. ఆయన పాలన సహించం..

rajnikanth movie darbar look leak

ఎంతవరకైనా రాజకీయాలలోకి వెళ్తే తిప్పలు తప్పవనేది మరోసారి రుజువుఅయ్యింది. సినిమాలలో నటించినంతసేపు మావాడు అన్న తమిళులు ఇప్పుడు తమ సూపర్ స్టార్ రజనీకాంత్‌ ను స్థానికేతరుడు అంటున్నారు. తమిళనాడును తమిళుడే పాలించాలని, రాష్ట్రేతరులు పాలించడాన్ని తాము అడ్డుకుంటామని నామ్‌ తమిళర్‌ కట్చి సమన్వయకర్త సీమాన్‌ హెచ్చరించారు. రజనీకాంత్ కనుక రాజకీయ పార్టీని ప్రకటిస్తే దానిని అడ్డుకుని తీరుతామన్నారు.

కాంచీపురంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీమాన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని డీఎంకే, అన్నాడీఎంకే వంటి పార్టీలను దూరం పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ ఓటమి పాలు కావడంపై సీమాన్ మాట్లాడుతూ.. తాను ఓడిపోలేదని, ప్రజలే ఓడిపోయారని అన్నారు. తాను చదువుకోకపోయినా ఇతరుల చదువు కోసం శ్రమించిన కామరాజర్ వంటి నాయకులు ఇప్పుడు లేరని సీమాన్ అన్నారు.

Related posts