telugu navyamedia
సినిమా వార్తలు

గొప్ప మ‌న‌సున్న మ‌హేష్‌బాబు పుట్టిన రోజు నేడు..స్పెష‌ల్ స్టోరీ

మహేశ్‌ బాబు…పేరు వింటే ఓ వైబ్రేష‌న్‌..అమ్మాయిల మనసు దోచేచుకున్న‌ రాజ‌కుమారుడు ..నేడు మహేష్ బాబు ఇవాళ 47వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 

Mahesh Babu Birthday: Here's why he is the superstar of Tollywood | The  Times of India

సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా స్టార్ డమ్ తెచ్చుకున్న ఏకైక నటుడు మహేష్ బాబు. టీనేజ్ లోనే మహేష్ సోలో హీరోగా సినిమాలు చేశాడు. అలాగే అన్న, నాన్నలతో కలిసి మల్టీస్టారర్స్ లో నటించారు

Happy Birthday superstar Krishna: 'I owe it all to you,' says Mahesh Babu |  Entertainment News,The Indian Express

ఘట్టమనేని మహేశ్ ‌బాబు సూపర్ స్టార్ కృష్ణ, ఇందిర దంపతులకు 1975 ఆగస్టు 9న చెన్నైలో జన్మించారు. చెన్నై లో పుట్టి పెరిగిన మహేష్ బాబు తమిళ స్కూల్ లో చదువుకున్నారు.

Mahesh Babu wishes his mom on birthday with an adorable picture | Telugu  Movie News - Times of India

కోలీవుడ్ స్టార్స్ కార్తీ, సూపర్ స్టార్ దళపతి విజయ్ లు మహేష్ బాబు క్లాస్ మేట్స్.. అయితే మహేష్ బాబు తెలుగు భాషను అనర్గళంగా మాట్లాడినా తెలుగు చదవడం రాదు. చెన్నైలో విద్యాభ్యాసం కారణంగా తెలుగు చదవడం రాదు. తాను తెలుగు చదవలేనని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే.

Rajakumarudu

రాజకుమారుడు సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబుకి మొట్టమొదటి హిట్ వచ్చిన సినిమా మురారి. వంశీ సినిమాలో తనతో నటించిన బాలీవుడ్ హీరోయిన్ నమ్రత శిదోర్కర్ ను ప్రేమించాడు. 4 ఏళ్ళు డేటింగ్ అనంతరం ముంబై లో రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత తండ్రి కృష్ణను.. అక్క మంజుల ఒప్పించిందని అంటారు.

Why Mahesh Babu's wife doesn't watch his movies - Rediff.com movies

ఒక్కడు సినిమాతో తొలి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. ఇక పోకిరి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఆల్ టైం సినీ ఇండస్ట్రీ రికార్డ్ ను సృష్టించాడు. చిత్ర పరిశ్రమలో అత్యంత సంపన్న నటుల్లో మహేష్ బాబు ఒకరు. నటుడు , నిర్మాత, పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా భారీగా సంపాదిస్తున్న మహేష్ బాబు.. తన సంపాదంలో లో 30 శాతం వివిధ సేవలకు ఖర్చు చేస్తారు.

EXCLUSIVE: Mahesh Babu and I make sure Sitara is well within her limits,  says Namrata Shirodkar | PINKVILLA

అంతేకాదు 1000 మందికి పైగా చిన్నారులకు తన భార్య నమ్రతతో కలిసి సొంత ఖర్చులతో వారికి చికత్స చేయించారు. అంతేకాదు ఆర్ధికంగా బలంగా లేని కుటుంబాలకు తన సొంత ఖర్చులతో వైద్య సేవలు అందిస్తూ నిజ జీవితంలోనూ గొప్ప మనసున్న ‘అతిథి’గా మహేశ్‌ అందరిచేత కీర్తించబడుతున్నాడు. ఇవి మాత్రమే కాకుండా క్టిష్ట పరిస్థితిల్లో ప్రభుత్వాలకు అండగా నిలుస్తున్నాడు. హుదుద్‌ తుఫాను సమయంలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విరాళంగా రూ. 2.5 కోట్లు, కరోనా సమయంలో సినిమా కార్మికులకు కోసం రూ. 25 లక్షలు అందించాడు. అంతేకాదు గతేడాది తాను దత్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామంలోని ప్రజలను మహమ్మారిన నుంచి రక్షించేందుకు తన తండ్రి కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఫ్రీ వ్యాక్సిన్‌ డ్రైవ్‌ నిర్వహించి గొప్ప మనసు చాటుకున్నారు.

నేడు 47వ ఏట అడుగుపెట్టిన సూపర్ స్టార్ మ‌హేష్‌బాబు కు అభిమానులతో పాటు సినీ, రాజకీయా ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువ. ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆయన ఫోటోస్ షేర్ చేస్తూ.. సంబరాలు చేసుకుంటున్నారు.

Related posts