telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

24 గంటల్లో కిడ్నప్ కేసును చేధించిన హైదరాబాద్ పోలీసులు…

తెలంగాణ పోలీస్ వ్యవస్థ రోజురోజుకు బలోపేతం అవుతుంది. అయితే కేవలం 24 గంటల్లో ఓ చిన్నారి కిడ్నాప్ కేసును ఛేదించామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు. ఈ నెల 27న మధ్య రాత్రి  ముసారాంబాగ్ చౌరస్తా లో అమ్ములు అనే చిన్నారి కిడ్నాప్ చేశారని, చెత్త ఏరుకొనే జీవనం సాగిస్తున్న అజయ్ , లక్ష్మీ కూతురు ను కిడ్నాపర్ ఎత్తుకెళ్లాడని అన్నారు. రాత్రి 2 గంట సమయంలో తల్లిదండ్రులు మధ్య పడుకున్న అమ్ములను బైక్ పై వచ్చి  కిడ్నాపర్ ఎత్తుకెళ్లగా సిసి ఫుటేజ్ ఆధారంగా నిందితుడు ను పట్టుకున్నామని అన్నారు. కిడ్నాపర్ నుండి చిన్నారిని రక్షించామన్న ఆయన ఆటో డ్రైవర్ గా పని చేస్తున్న కిడ్నాపర్ శ్రవణ్ కుమార్ ను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. పిల్లలు లేని తల్లిదండ్రులకు చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి అమ్మేందుకు ప్రయత్నం చేసే అవకాశం ఉందని నిందితుడుని ఆ కోణంలో కూడా విచారణ చేస్తున్నామని అన్నారు. నిందితుడు పై గతంలో చాలా కేసులు ఉన్నట్లు విచారణలో తేలిందన్న ఆయన మలక్ పేట్ 2 , కాచిగూడ, సరూర్ నగర్, ఎల్బీ నగర్ లో నిందితుడు పై చోరీలు కేసులు ఉన్నాయని అన్నారు.  చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts