సినీ పరిశ్రమలో ప్రచారంలో కొత్త పంధా కనిపిస్తుంది. ఇంతకముందు ఏదైనా సినిమా విశేషం చెప్పాలనుకుంటే, మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించేవారు. కానీ ఇప్పుడు ప్రతి చిన్నది, లీక్ అనే పేరుతోనే విడుదల చేస్తున్నారు. అది కూడా సామజిక మాద్యమాలలోనే చేస్తుండటం విశేషం. దీనికి ప్రత్యేక కారణంగా, ఇప్పుడు ఆ మాధ్యమాలకు పెరిగిన డిమాండే అని చెప్పుకోవచ్చు. అదే తరహాలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న ‘మహర్షి’ చిత్రానికి కూడా ప్రచారం చేస్తున్నారు. ఆ చిత్రంలోని ప్రతి విషయాన్నీ ఆసక్తికరంగా వెల్లడిస్తున్నారు. ఈ లీక్ లతో చిత్రంపై అంచనాలు పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏప్రియల్ లో విడుదల కాబోతున్న ఈమూవీ సమ్మర్ రేస్ విజేతగా మారుతుందని మహేష్ అభిమానులు విపరీతమైన అంచనాలు పెట్టుకుంటున్నారు.
స్నేహంలో ఉండే ఎమోషన్ తో పాటు తల్లి తండ్రులతో ఉండే ఎమోషన్ వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా ఫైనల్ గా సొసైటీకి ఎంత అవసరం అన్న సున్నితమైన అంశం చుట్టూ అల్లబడ్డ ఈకథ క్లాస్ ప్రేక్షకులతో పాటు మాస్ ప్రేక్షకులకు కూడ నచ్చుతుందని అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం ఫైనల్ దశ షూటింగ్ లో ఉన్న ఈమూవీలో మరొక హీరో నటిస్తున్నట్లు అధికారికంగా లీకులు వదులుతున్నారు. కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో రోలింగ్ స్టార్ గా పేరుగాంచిన శ్రీమురళి ఈమూవీలో మరో కీలక పాత్ర చేస్తున్నట్టుగా తెలిపారు. శ్రీమురళి లేటెస్టుగా ఆన్ లొకేషన్ మహేష్ ని కలిసినప్పటి ఫోటోల్ని ప్రముఖ టాలీవుడ్ పీ ఆర్ వో బీఏ రాజు ట్వీట్ చేశాడు.
While shooting For #Bharaate in #RFC Was Happy to meet Our most Humble Super Star @urstrulyMahesh at his #Maharshi sets… Thanks for your Kind time and All the best for all your Future projects Sir… cheers! pic.twitter.com/WXMBAnNtaG
— SRIIMURALI (@SRIMURALIII) February 13, 2019
కన్నడలో రిలీజైన ‘ఉగ్రం’ చిత్రంలో కథానాయకుడిగా నటించిన శ్రీమురళిని కన్నడ ప్రేక్షకులు అభిమానంతో రోలింగ్ స్టార్ అని పిలుస్తారు. కన్నడంలో బాగా పాపులర్ అయిన ఈహీరోను ఇప్పుడు ‘మహర్షి’ లో ఒక కీలక పాత్ర చేయిస్తున్న నేపథ్యంలో ఈమూవీకి కన్నడ మార్కెట్ లో కూడ మంచి క్రేజ్ ఏర్పడుతుందని అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే ఈమూవీ కథ కొంత వరకు ‘శ్రీమంతుడ కు సీక్వెల్ గా ఉంటుంది అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ రోలింగ్ స్టార్ ‘మహర్షి’ మూవీ ఎంట్రీ సంచలనంగా మారింది.