telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

కేంద్రం కొత్త పథకం.. బాలబాలికలకు 3వేల ఉపకారవేతనం.. నెలకు..

monthly 3000 to all soon by central govt

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని నూతన మంత్రిమండలి తొలిసారి సమావేశమైంది. ప్రధాని కార్యాలయంలో మోదీ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో హోంమంత్రి అమిత్‌షా సహా 24మంది కేబినెట్‌ మంత్రులు, 9మంది స్వతంత్ర హోదా కల్గిన మంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్లమెంట్‌ సమావేశాల తేదీ సహా పలు కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉన్నట్టు సమాచారం. భారత రక్షణ నిధి నుంచి ఇచ్చే విద్యార్థులకు ఇచ్చే ఉపకార వేతనాల అంశంపై కీలక నిర్ణయం తీసుకున్నారు.

బాలురకు నెలకు ఇచ్చే రూ.2వేల ఉపకారవేతనాన్ని రూ.2500లకు పెంచారు. అలాగే, బాలికలకు ఇచ్చే రూ.2250ను 3వేలకు పెంచాలని నిర్ణయించారు. అలాగే, కేంద్ర, పారామిలటరీ బలగాలకు మాత్రమే ఉన్న ఈ ఉపకారవేతనాలను రాష్ట్రాలకు విస్తరించాలని నిర్ణయించారు. ఏడాదికి 500 మంది రాష్ట్ర పోలీసు విభాగాలకు చెందిన వారి నుంచి ఇకపై ఎంపిక చేయనున్నారు. వీటన్నింటికి నోడల్‌ మంత్రిత్వశాఖగా హోంశాఖ ఉండనుంది. ఖాయిలా పడిన ప్రభుత్వరంగ సంస్థల విషయంలో, 60 ఏళ్లు దాటిన రైతులకు భృతి ఇవ్వాలనే విషయంలోను కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Related posts