telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీపీఎస్సీ చైర్మన్‌గా గౌతమ్‌ సవాంగ్‌..కొత్త డీజీపీగా రాజేంద్ర‌నాథ్ రెడ్డి..

*ఏపీపీఎస్సీ చైర్మన్‌గా గౌతమ్‌ సవాంగ్ ను నియ‌మిస్తూ జీవో జారీ..
*కొత్త డీజీపీగా రాజేంద్ర‌నాథ్ రెడ్డి..
*ఏపీ డీజీపీగా రాజేంద్ర‌నాథ్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌ర‌ణ‌.

ఏపీపీఎస్సీ చైర్మన్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి గౌతమ్‌ సవాంగ్‌ను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా, 2019 జూన్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ డీజీపీగా బాధ్యతలు నిర్వర్తించిన సవాంగ్‌ను ప్రభుత్వం నాలుగు రోజుల క్రితం బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆయన సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్‌ చేయాలని ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో సవాంగ్‌ను ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

మరోవైపు రాజేంద్ర నాధ్ రెడ్డి డీజీపీగా బాధ్యతలను స్వీకరించారు. ఈసందర్భంగా బదిలీ అయిన డీజీపీ గౌతమ్ సవాంగ్, నూతన డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి గౌరవ వందనం స్వీకరించారు.

రాజేంద్ర నాధ్ రెడ్డి మాట్లాడుతూ..అపార‌మైన విశ్వాసంతో నాకు డీజీపీగా బాధ్య‌త‌లు ఇచ్చిన గౌర‌వ ముఖ్య‌మంత్రి సీఎం జ‌గ‌న్‌ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు..

రాజేంద్ర నాధ్ రెడ్డిది కడప జిల్లా. 1992కు చెందిన రాజేంద్ర నాధ్ రెడ్డి తొలుత నిజామాబాద్ జిల్లా బోధన్ ఏఎస్సీగా పనిచేశారు. అక్కడి నుంచి తెలంగాణలో వరంగల్, జనగాం ఏఎస్పీగా పనిచేశారు. అనంతరం విశాఖ రూరల్ ఎస్పీగా పనిచేశారు. రైల్వే ఎస్సీగా కూడా పనిచేశారు.ఇంటలిజెన్స్ చీఫ్ గా కూడా ఉన్నారు.

Related posts