ప్రజావేదికను కూల్చి ప్రజాధనాన్ని నీళ్ల పాలు చేశారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ప్రజావేదికను కూల్చడం ద్వారా ప్రజల సొమ్మును నీళ్ల పాలు చేసినట్టయిందని విమర్శించారు. ప్రజల సొమ్మును నీళ్లపాలు చేసే అధికారం ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నించారు.
అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమం చంద్రబాబు నివాసం నుంచి ప్రారంభించినట్టయితే వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రశసించేవాడినని అన్నారు. ఎనిమిది కోట్ల రూపాయలతో ప్రజావేదికను నిర్మించారని ప్రభుత్వం చెబుతోందని, దాన్ని కూలగొట్టి ప్రజాధనం వృథా చేయడం కన్నా పేద ప్రజలకు ఉపయోగిస్తే బాగుండేదన్నారు.