telugu navyamedia
తెలంగాణ వార్తలు

మహిళను లాఠీతో కొట్టి ఎస్ఐ ..ఉద్రిక్త‌త‌

హైదరాబాద్ లో సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారు జామున మహిళ పట్ల అమానుషంగా వ్యవహరించడం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారులు దీనిపై ఆరా తీస్తున్నారు. ఎస్‌ఐ సూరజ్, ఒక కానిస్టేబుల్ ముస్లిం మహిళ లాఠీని ఝళిపించారు.

వివ‌ర్లాలోకి వెళితే..

సైఫాబాద్ నుండి ఓ కారులో ముస్లిం మహిళలు నాంపల్లి వైపు వెళుతుండగా బస్సుకు వారు ప్రయాణిస్తున్న కారు కు తాకింది. అయితే మైనర్ ఆక్సిడెంట్ జరిగింది.

అయితే ఇది మైనర్ యాక్సిడెంట్ అని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నా బస్సు డ్రైవర్ తో జరిగిన వాగ్వాదం కారణంగా అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో మహిళలు, బస్సు డ్రైవర్ ఒకరితో ఒకరు వాగ్వాదానికి దిగారు. అయితే ఇంతలోనే స్పాట్ కు చేరుకున్న సైఫాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్సై సూరజ్ ఓ కానిస్టేబుల్ లాఠీతో మహిళలను కొట్టారు.

దీంతో అక్కడికి పెద్దఎత్తున చేరుకున్న యువకులు, బాధిత కుటుంబం సభ్యులు తమకు న్యాయం కావాలని రోడ్డు పై ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని ఎస్సై సూరజ్, కానిస్టేబుల్ ను సస్పెండ్ చేయాలని పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. తమను లాఠీతో గాయపరిచిన ఎస్సై, కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేశారు.

దీనిపై బాధిత మహిళ ..ఎస్ఐ, కానిస్టేబుల్ పై ఉన్నతాధికారులకు సైఫాబాద్ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదును స్వీకరించిన‌ నాంపల్లి సీఐ ఖలీల్‌ పాషా విచారణ చేపట్టి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

 

Related posts