తెలంగాణలో మొన్న జరిగిన లోక్ సభ ఎన్నికల పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి మాట్లాడుతూ ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల తర్వాత తెలంగాణలో పెద్ద ఎత్తున ఓటింగ్ నమోదు కావడంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విఙ్ఞప్తి చేశామన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో గెలవాలనే లక్ష్యంతోనే పోటీ చేసిందని తెలిపారు. ఖమ్మంలో తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇంటర్ అవకతవకల్లో విద్యార్థుల ప్రాణాలు పోవడానికి కేసీఆర్ ప్రభుత్వ వైఖరే కారణమని మండిపడ్డారు. నిజామాబాద్, సికింద్రాబాద్, ఖమ్మం, హైదరాబాద్‌లలో ఐదు గంటల తర్వాత లక్షల ఓట్లు పోలింగ్ కావడంపై అనుమానాలున్నాయని మర్రి శశిధర్ రెడ్డి, రేణుకా చౌదరి, నిరంజన్ పేర్కొన్నారు.