telugu navyamedia
తెలంగాణ వార్తలు

హైదరాబాద్ లో అంతర్జాతీయ స్థాయి కేంద్రం..

కోర్టు వివాదాలను మధ్యవర్తిత్వంతో పరిష్కరించేందుకుకు వెసులు బాటుకల్పించే వ్యవస్థకు హైదరాబాద్ వేదిక కాబోతోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ ప్రత్యేక చొరవతో హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్, అండ్ మీడియేషన్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధంచేశారు. కార్యరూపం దాల్చడంతో నానక్ రామ్ గూడాలోని వీకే టవర్స్ లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించారు.

Thumbnail image

ఈ కార్యక్రమంలో ట్రస్టీలు – సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వర రావు, జస్టిస్ హిమాకోహ్లి, సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ ఆర్వీ రవీంద్రన్, హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

అంతర్జాతీయస్థాయి కేంద్రాన్ని భారతదేశంలో తొలిసారిగా ఏర్పాటుచేసిన ఆర్బిట్రేషన్, అండ్ మిడియేషన్ సెంటర్ ను ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నూతలపాటి వెంకటరమణ, హైదరాబాద్ కు సమున్నత గౌరవాన్ని తీసుకొచ్చారని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రజానీకం తరఫున ప్రత్యేక కృతజ్ఞత‌లు తెలిపారు. హైదరాబాద్ లో కేంద్రాన్ని ఏర్పాటుచేసేందుకు ముందుగానే అంతర్జాతీయస్థాయిలో పెద్దకేసు పరిష్కారంకోసం ఎదురుచూడటం శుభ పరిణామమన్నారు.

హైదరాబాద్ లో అంతర్జాతీయస్థాయి కేంద్రాన్ని ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదించిన నాలుగునెలల్లోనే కార్యరూపం దాల్చిందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నూతలపాటి వెంకటరమణ తెలిపారు. ఆర్బిట్రేషన్, అండ్ మీడియేషన్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతీసుకోవడం అభినందనీమమన్నారు.

Related posts