telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్.. పడిపోయిన చికెన్‌ ధరలు..

chicken ban karona

కరోనా టైంలోనూ చికెన్‌ తింటే కరోనా వస్తుందని భయపడ్డారు జనం. దీంతో అప్పుడు చికెన్ ధరలు అమాంతం పడిపోయాయి. చివరకు ఫ్రీగా ఇచ్చినా తీసుకునే వాళ్లు లేకుండా పోయారు. ప్రభుత్వాలు అవగాహన కల్పించి చికెన్‌ కి కరోనా కి సంబంధం లేదని తేల్చి చెప్పడంతో మళ్లీ పౌల్ట్రీ రంగం పుంజుకుంది. గత రెండు నెలలుగా చికెన్‌ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఇప్పుడిప్పుడే కరోనా కష్టాల నుంచి బయటపడుతోంది పౌల్ట్రీ రంగం. అయితే మళ్లీ బర్డ్‌ ఫ్లూ ఎఫెక్ట్ పడింది. పక్క రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విజృభిస్తుండడంతో తెలుగు రాష్ట్రాల్లోనూ భయం నెలకొంది. ఇక్కడ కూడా కొన్ని జిల్లాల్లో కోళ్లు మృత్యువాత పడుతుండటంతో… జనాల్లో టెన్షన్‌ మొదలైంది. జనాల్లో బర్డ్ ఫ్లూ భయం వల్ల తెలుగు రాష్ట్రాల్లో చికెన్‌ ధరలు భారీగా పడిపోయాయి. ఏపీలో కొన్ని ప్రాంతాల్లో కిలో చికెన్‌ 100 రూపాయలకు చేరుకుంది. తెలంగాణలో 140 రూపాయలకు చేరింది. చాలా మంది చికెన్‌ సెంటర్ల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. కొన్ని రోజులు చికెన్‌ కి దూరంగా ఉండటమే బెటర్‌గా భావిస్తున్నారు. చికెన్‌ చిక్కుల్లో పడటంలో… మటన్‌ కి డిమాండ్‌ ఎక్కువైంది. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు మటన్‌ ధరలను పెంచేశారు. కొన్ని నెలలుగా 700 రూపాయలకు కిలో ఉన్న మటన్‌ ఇప్పుడు 800 రూపాయలకు చేరింది. మటన్‌, ఫిష్‌ సెంటర్ల వద్ద బాగా రద్దీ ఉంటోంది.

Related posts