ఏపీకీ మూడు రాజధానులు ఉండవచ్చని సీఎం జగన్ చేసిన ప్రకటనపై అమరావతి రైతులు దీక్ష చేపట్టిన విషయం విధితమే. మందడంలో రైతుల దీక్షకు జనసేన నేత, సినీనటుడు నాగబాబు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో రైతులు తమ కుటుంబాలతో పాటు రోడ్డుపైకి వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పోరాటానికి మద్దతు తెలుపుతున్నానని చెప్పారు.
అమరావతిలో రాజధానిని యథాతథంగా కొనసాగించాలన్నదే జనసేన డిమాండ్ అని నాగబాబు తెలిపారు. గతంలో చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న ఒప్పందాలను వైసీపీ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం పోరాడేందుకు తమ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు.
మూడు ముక్కలాట ఎందుకు ఆడుతున్నారు: చంద్రబాబు ఫైర్