telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఈ ఎన్నికల్లో కొందండరాం ఎందుకు పోటీ చేసి ఎం చేస్తారు…?

బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి హన్మకొండలో మీడియాతో మాట్లాడుతూ… ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొందండరాం ఎందుకు పోటీ చేస్తున్నారు, ఎం చేస్తారు? అని ప్రశ్నించారు. ఇక, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఏరోజు ఎవరికోసం పని చేయలేదు.. కేసీఆర్ చుట్టూ తిరగడం తప్ప అని ఎద్దేవా చేసిన ఆయన.. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి కింది స్థాయి నుండి వచ్చిన వ్యక్తి , విద్యార్థి దశ నుండి ఏబీవీపీలో, 30 ఏళ్లుగా బీజేపీలో పనిచేస్తున్నారని తెలిపారు.. ఇక, కేంద్రం నుండి వచ్చే నిధులతోనే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారని విమర్శించిన జితేందర్ రెడ్డి.. వ్యవసాయ రంగం, విద్య, వైద్యం, రోడ్లకు అన్నింటికీ కేంద్రం నిధులు ఇస్తుందన్నారు.. గ్రామాల్లో 15వ ప్రణాళిక సంఘం పేరుతో వచ్చే నిధులతోనే పనులు జరుగుతున్నాయి.. వలస కూలీలకు ఉపాధి హామీ పథకం పేరుతో నేరుగా డబ్బులు ఇస్తుందని తెలిపారు. కానీ రూ. 4 వేల కోట్లు లైఫ్ స్టాక్ కోసం ప్రతి ఏడాది కేంద్రం ఇస్తుందన్నారు జితేందర్ రెడ్డి… కాళేశ్వరం, పాలమూరు, మిషన్ భగీరథ ప్రాజెక్టులు ఏవి కూడా పూర్తి కాలేదని విమర్శించారు.. వరంగల్‌కు ఇచ్చిన స్మార్ట్ సిటీ, అమృత్, హృదయ పథకం నిధులు పక్కదారి పట్టించారని ఆరోపించిన బీజేపీ నేత.. పట్టభద్రులు ఇద్దరు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అంటే, కేంద్రం నిధులు పక్కదార పట్టకుండా ఆపాలి అంటే బీజేపీ అభ్యర్థులు గెలవాలన్నారు. స్వతంత్రులకు ఇలా ప్రశ్నించే అవకాశం లేదన్న ఆయన.. ఆంధ్రలో తుఫాన్‌లకు తెలంగాణ నిధులు పెడుతున్నాడు తప్ప.. ఇక్కడ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టడంలేదన్నారు.

Related posts