telugu navyamedia
క్రీడలు వార్తలు

రహానేకు ఇది మంచి అవకాశం : కోహ్లీ

ఐపీఎల్ తర్వాత ఆసీస్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు రేపటినుండి ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ లో తలపడనుంది. అయితే ఈ సిరీస్  లో రెండో టెస్టు మ్యాచ్ నుంచి కెప్టెన్సీ భాధ్యతలు చెప్పటే అజింక్య రహానె పై తనకు పూర్తి విశ్వాసం ఉంది అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. అయితే తన భార్య అనుష్క శర్మ జనవరిలో ఓ బిడ్డకు జన్మనివ్వబోతుండటంతో తొలి టెస్ట్ తర్వాత విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా నుంచి భారత్ కు రానున్నాడు. దాంతో ఆ తర్వాతి మూడు టెస్ట్ మ్యాచ్ లకు ప్రస్తుతం టెస్ట్ వైస్ కెప్టెన్ గా ఉన్న రహానే న్యాయకత్వం వహించనున్నాడు. అయితే రహానే గతంలో రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా (2017) మరియు ఆఫ్ఘనిస్తాన్ (2018) కు వ్యతిరేకంగా భారత జట్టుకు నాయకత్వం వహించి వాటిలో విజయం సాధించాడు. కానీ ఆ రెండు మ్యాచ్ లు భారత్ వేదికగా జరిగాయి. దాంతో రహానే విదేశీ పర్యటనల్లో జట్టుకు నాయకత్వం వహించడం ఇదే మొదటిసారి. అయితే ఈ విషయం పై కోహ్లీ మాట్లాడుతూ… రహానే పై నాకు పూర్తి నమ్మకం ఉంది. రహానే నేను చాలా సంవత్సరాలుగా కలిసి ఆడుతున్నాము. మేము బ్యాటింగ్ లో గొప్ప భాగసౌమ్యలు నెలకొల్పము. రహానే ఆసీస్ తో జరిగిన రెండు ప్రాక్టీస్ మ్యాచ్ లలో అద్భుతమైన కెప్టెన్సీ చేసాడు. ఇది తనను తాను నిరూపించుకోవడానికి రహానేకు గొప్ప అవకాశం అని కోహ్లీ పేర్కొన్నాడు. చూడాలి మరి ఈ సిరీస్ లో రహానే కెప్టెన్ గా ఎంత మేర రాణిస్తారు అనేది.

Related posts