telugu navyamedia
రాజకీయ వార్తలు

కరోనా కట్టడికి “మహా” నిర్ణయం.. ముంబైలో రోడ్డెక్కితే జైలుకే!

taj hotel mubai

మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో ఆ రాష్ట్రంలో రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా రాజధాని ముంబై మహా నగరం ఈ మహమ్మారి దెబ్బకు అల్లాడుతోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వైరస్ ప్రభావం తగ్గడం లేదు. కేసులు, మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముంబైలో మే 17 వరకు సెక్షన్ 144 విధిస్తున్నట్టు ప్రకటించింది. వైద్యం కోసం తప్ప వేరే ఇతర పనుల కోసం రోడ్లపైకి రావద్దని మహా ప్రభుత్వం హెచ్చరించింది. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా రోడ్డుపైకి వస్తే… 6 నెలల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించింది. రాత్రి వేళల్లో కేవలం మెడికల్ ఎమర్జెన్సీ వాహనాలను మాత్రమే అనుమతిస్తారు.

Related posts