telugu navyamedia
సినిమా వార్తలు

ఆ సినిమా కథ విని దర్శకుడిని తిట్టేశా.. : సంగీత

Sangeetha

తమిళంలో శ్రీరామ్ తో కలిసి సంగీత చేసిన ఒక సినిమా, తెలుగులో “మనోహరా” పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు భాషల్లోను ఈ సినిమా విజయాన్ని సాధించింది. తాజాగా ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో సంగీత మాట్లాడుతూ ఈ సినిమాను గురించి ప్రస్తావించారు. “మనోహరా” సినిమా చేయమని దర్శకుడు అడిగారు. ఒక వదిన తన మరిదిపై మనసు పారేసుకునే కథ అది. ఆయన ఆ కథ చెప్పగానే ‘ఏంటి సార్ ఈ కథ .. ఇలా ఎక్కడైనా జరుగుతుందా?’ అంటూ కోప్పడ్డాను. “మేడమ్ ఇది నా రియల్ లైఫ్ స్టోరీ” అన్నారాయన. ఆ మాటకి నేను చాలా షాక్ అయ్యాను. ఆలోచించుకోవడానికి నాకు కాస్త సమయం ఇవ్వమని చెప్పాను. ఆ తరువాత ఒక సైకియాట్రిస్ట్ ను కలుసుకుని, అలా ఆలోచించే యువతులు కూడా వుంటారని తెలుసుకుని అప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను” అని చెప్పుకొచ్చారు.

Related posts