ఆదివారం జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రాంగణం ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. ఎన్‌యూ హింసాత్మక దాడిపై బాలీవుడ్ తారలు మండిపడుతున్నారు. హీరోయిన్ స్వరా భాస్కర్, తాప్సీ పన్ను, షబానా అజ్మీ, రితేష్ దేశ్‌ముఖ్ ట్విటర్ వేదికగా దాడిని తీవ్రంగా ఖండించారు. జేఎన్‌యూ పూర్వ విధ్యార్ధి, నటి స్వరా భాస్కర్ తల్లి ప్రస్తుతం జేఎన్‌యూలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె దుండగులని కఠినంగా శిక్షించాలని చెబుతూ, గాయపడ్డ వారికి సాయం చేయాలని కోరారు. ఏబీవీపీ సభ్యులే విద్యార్థులపై దాడి చేశారని ఆరోపించారు తాప్సీ. పిల్లల భవిష్యత్‌కు మంచి బాటలు పడాల్సిన చోట ఇటువంటి పరిస్థితి తలెత్తింది. ఇది ఎంతమాత్రం మంచిది కాదు అని అన్నారు. ఆదివారం ఏం జరిగిందంటే… ముసుగులు ధరించిన కొందరు దుండగులు వర్సిటీలోని సబర్మతితో పాటు మరికొన్ని వసతి గృహాల్లోకి చొచ్చుకెళ్లి కర్రలు, రాడ్లు, రాళ్లతో విద్యార్థులపై దాడులకు పాల్పడ్డారు. వర్సిటీ ఆస్తులను ధ్వంసం చేశారు. అడ్డుకునేందుకు యత్నించిన ప్రొఫెసర్లపైనా దాడి చేశారు. విద్యార్థులతోపాటు వసతి గృహాలపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడుల్లో దాదాపు 19 మంది విద్యార్థులతో పాటు వర్సిటీ విద్యార్థి సంఘం ప్రెసిడెంట్ ఆయిశీ ఘోష్ తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన వాళ్లను ఎయివ్ దవాఖానకు తరలించారు.
previous post
next post
వేణుమాధవ్ పై హైపర్ ఆది వ్యాఖ్యలు