telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

భారత్ లో .. సౌదీ భారీ పెట్టుబడులు..

saudi huge investments in india

భారత్‌లోని పెట్రో కెమికల్స్‌, మౌలిక సదుపాయాలు, మైనింగ్‌ వంటి రంగాలలలో సౌదీ అరేబియా భారీగా పెట్టుబడులు పెట్టనున్నది. దేశ వృద్ధి సామర్థ్యాన్ని పరిగణనలోకి తీససుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌది రాయబారి డాక్టర్‌ సావుద్‌ బిన్‌ మహ్మద్‌ అల్‌ సతి తెలిపారు. సౌది అరేబియాకు భారత్‌ ఒక ఆకర్షణీయమైన పెట్టుబడిదారి దేశమని, చమురు, గ్యాస్‌, గనులు వంటి కీలక రంగాలలో భారత్‌తో దీర్ఘకాలిక భాగస్వామ్యం కొనసాగించే లక్ష్యంతో ఉన్నట్లు ఆయన చెప్పారు.

ఇంధనం, శుద్ధి, పెట్రోకెమికల్స్‌, మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, ఖనిజాలు, మైనింగ్‌ రంగాలలో 100 బిలియన్‌ డాలర్ల విలువైన పెట్టుబడులు పెట్టాలని సౌదీ అరేబియా చూస్తోందన్నారు. ఒక మీడియా సంస్ధకు ఆదివారం ఇచ్చన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు చెప్పారు. సౌది అరేబియాలోనే అతిపెద్ద చమురు దిగ్గజంగా ఉన్న అరాంకో భారత్‌లోని రిలయన్స్‌ ఇండిస్టీస్‌ లిమిటెడ్‌తో ప్రతిపాదించిన భాగస్వామ్యం, రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఇంధన సంబంధాల వ్యూహాత్మక స్వభావాన్ని ప్రతిబింబిస్తున్నదని ఆయన చెప్పారు.

Related posts