telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నువ్వు ఏమైనా పతివ్రతవా? నీ బండారం మొత్తం బయటపెడతా… ?… వనిత విజయ్ కుమార్ మూడో పెళ్లిపై రచ్చ

Vanitha

తమిళ నటుడు విజయ్ కుమార్ కూతురు వనిత మూడో పెళ్లి సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ విషయం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఓ టీవీ షో లైవ్ లో వనితా విజయ్ కుమార్ రెచ్చిపోయి బూతులు మాట్లాడారు. తాజాగా లక్ష్మీ రామకృష్ణన్, వనితలు ఒక లైవ్ చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఇద్దరి మధ్య చర్చ వేడివేడిగా సాగింది. ఒకానొక సందర్భంలో లక్ష్మీ రామకృష్ణన్ ను వనిత ‘నేను పెళ్లి చేసుకుంటే నీకు వచ్చిన సమస్య ఏంటీ?’ అంటూ ప్రశ్నించింది. గతంలో ఏవో కారణాల వల్ల విడాకులు ఇచ్చాను. నన్ను తప్పు అనడానికి నువ్వు ఏమైనా మద్రాస్ హైకోర్టు జడ్జ్ అనుకుంటున్నావా ? ఒక్క భర్తతో సంసారం చేసినంత మాత్రాన నువ్వు ఏమైనా పతివ్రతవు అనుకుంటున్నావా ? నా భర్తలతో కలిసి కలిసి ఉన్నప్పుడు నీతిగా, నిజాయితీగా ఉన్నాను. నీ మాదిరిగా భర్తను మోసం చేయలేదంటూ లక్ష్మీ రామకృష్ణన్‌పై ఫైర్ అయ్యారు వనిత. నీవు ఉన్న ఇండస్ట్రీలోనే నేను ఉన్నాను. నీ బండారం అంతా నాకు తెలుసు. మొత్తం బయట పెడతా ? అంటూ హెచ్చరించింది. వనిత మూడో పెళ్లిపై… లక్ష్మీ రామకృష్ణన్, కుట్టి పద్మిని, కస్తూరి శంకర్ తదితర సెలబ్రిటీలు విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు.

Related posts