telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరో మెగా హీరోకు విలన్ గా విజయ్ సేతుపతి ?

mandi ad troubles vijay setupati

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి హీరోగానే కాదు విలన్ గా వెండితెరపై సత్తా చాటుతున్నాడు. ఆయన ఇప్పుడు వ‌రుస తెలుగు సినిమాల‌తో ఫుల్ బిజీగా మారిపోయారు. ఇప్ప‌టికే వైష్ణ‌వ్ తేజ్ హీరోగా రూపొందుతోన్న `ఉప్పెన‌` చిత్రంతో పాటు బ‌న్నీ-సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న మ‌రో చిత్రంలోనూ విజ‌య్ సేతుప‌తి విల‌న్‌గా న‌టిస్తున్నాడు. కాగా.. ఇప్పుడు మ‌రో మెగా హీరో సినిమాలో విజ‌య్ సేతుప‌తి విల‌న్‌గా న‌టించ‌బోతున్నాడ‌ని టాక్‌. ఇంత‌కూ ఆ మెగా హీరో ఎవ‌రో కాదు.. వ‌రుణ్‌తేజ్‌. ఈ యువ క‌థానాయ‌కుడితో కిర‌ణ్ కొర్ర‌పాటి అనే డెబ్యూ డైరెక్ట‌ర్ ఓ సినిమాను తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో వ‌రుణ్‌తేజ్ ప్ర‌తినాయ‌కుడిగా విజ‌య్ సేతుప‌తి న‌టిస్తాడ‌ని టాక్‌. త్వ‌ర‌లోనే ఈ విష‌యంపై ఓ క్లారిటీ రానుంది.

Related posts