telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఉత్కంఠను రేకెత్తిస్తున్న “విశ్వక్” టీజర్

Vishwak

వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ”విశ్వక్”. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు (అక్టోబర్ 2) రిలీజ్ చేశారు. “ఎన్నారైలకేమో బాధ్యత లేదు.. ఇక్కడున్న వాళ్లకి నిర్లక్ష్యం.. రైతువి నువ్వేం చేస్తున్నావ్ రా అంటూ టీజర్ మొదలవుతుంది. ‘ఫుడ్ బెడ్ బావుందని పక్కింటికి వెళ్లి బతుకుతావా? బెటర్ లైఫ్ ఉందని పక్క దేశానికి వెళ్తావా? సిగ్గుందారా” అంటూ హీరో చెప్పే డైలాగులు సూటిగా ప్రశ్నిస్తున్నట్టుగా ఉన్నాయి. అంతేకాకుండా టీజర్ లో ‘దేశాన్ని దత్తత తీసుకునేవారు కావాలి’ అని ప్లకార్డులు చూపించారు టీజర్ చివర్లో దర్శకుడు. మొత్తం మీదా నాలుగు సమస్యలపైన దర్శకుడు సినిమాని చూపించాలని అనుకున్నాడన్న విషయం అర్ధం అవుతుంది. టీజర్ తోనే సినిమా పైన భారీ అంచనాలను పెంచాడు దర్శకుడు. మీరు కూడా ఈ టీజర్ ను వీక్షించండి.

Related posts