telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏఐసీసీ అధ్యక్షుల .. జాబితాలో … ప్రియాంకా గాంధీ.. మొదటిగా..

Priyanka Gandhi started Ist road show

దశాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ లేని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామం ఆ పార్టీ శ్రేణులను తీవ్ర కలవరానికి గురిచేసింది. కాంగ్రెస్‌ ఆశాకిరణంగా భావించిన రాహుల్‌.. తొలి ఎన్నికల్లోనే పూర్తిగా తేలిపోవడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తికి గురైయ్యారు.

రాహుల్‌ రాజీనామాతో ఆ పార్టీలో నాయకత్వ సమస్య స్పష్టంగా కనిపిస్తోంది. ఫలితాల అనంతరం జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలోనే రాహుల్‌ రాజీనామా సమర్పించినప్పటికీ దానిపై ఇప్పటికీ సస్పెన్షన్‌ కొనసాగుతూనే ఉంది. రాజీనామాను ఉపసంహరించుకోవాలని పార్టీ సీనియర్లు, ముఖ్యమంత్రులు, ఎంపీలు బుజ్జగించిన్నప్పటికీ ఆయన ససేమిరా అన్నారు. దీంతో రాహుల్‌ స్థానంలో నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దానితోనే అసలు సమస్య ప్రారంభమైంది.

ఒకపక్క కన్నడ సంక్షోభం, మరోపక్క గోవాలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజీనామాలు ఆ పార్టీకి ఊహించని షాకిచ్చాయి. దీంతో మూలిగే నక్కపై తాడిపండు పడ్డట్లు అయింది కాంగ్రెస్‌ పని. ఇదిలావుండగా.. రాహుల్‌ రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో సమర్థవంతమైన నేత కోసం చర్చిస్తున్నట్లు ఆపార్టీ నేత జ్యోతిరాధిత్య సింథియా తెలిపారు. మరో వారంలో ఈ ప్రక్రియనంతా పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్‌ నూతన అధ్యక్ష పదవికి పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ సరైన వారంటూ మధ్యమంత్రి సజ్జన్‌ సింగ్‌ వర్మ చేసిన వ్యాఖ్యలు ఆపార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుత సమయంలో పార్టీని నడిపించగల సామర్థ్యం ప్రియాంకకు తప్ప మరెవ్వరికీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. దీనికి కొంతమంది నేతలు కూడా మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం. దీనితో ఆమె ఖాయమన్న వార్తలు జోరుగానే వినిపిస్తున్నాయి!!

Related posts