telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కమల్ భార్య ప్లేస్ ను నేను భర్తీ చేయట్లేదు… డేటింగ్ వార్తలపై స్పందించిన పూజాకుమార్

Pooja

స్టార్ హీరో కమల్ హాసన్ హీరోయిన్ గౌతమితో విడిపోయాక ఆయన మరో నటి పూజా కుమార్‌తో డేటింగ్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. పూజా కుమార్ తరచుగా కమల్ హాసన్ ఫ్యామిలీ ఫంక్షన్‌లకు హాజరవుతుండటం, వారి కుటుంబ సభ్యురాలిగా మెలుగుతుండడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ క్రమంలో తాజాగా ఈ ఇష్యూపై స్పందిస్తూ ఆ వార్తలను ఖండించింది పూజా కుమార్. ఇటీవలే ఓ మీడియాతో మాట్లాడిన ఆమె.. “గత ఐదారేళ్లుగా కమల్ సార్‌తో కలిసి పని చేస్తున్నా కాబట్టి తనకు కమల్‌తో పాటు వారి ఫ్యామిలీ మెంబెర్స్, బ్రదర్స్, ఆయన కూతుర్లు అందరూ బాగా పరిచయమని చెప్పింది. అందుకే వారి కుటుంబ వేడుకలకు హాజరవుతున్నా తప్పితే అంతకుమించి తమ మధ్య ఎలాంటి సంబంధం లేదు” అని పూజా కుమార్ పేర్కొంది. తాను కమల్ సార్ భార్య ప్లేస్ భర్తీ చేయనున్నట్లు అనుకుంటున్న దాంట్లో నిజం లేదు. ఇక కమల్ ఓ గొప్ప క్రియేటర్, మెస్మరైజర్. ఏ విషయాన్నైనా చాలా జాగ్రత్తగా డీల్ చేస్తారు. నాకు జీవితంలో ఓపిక గురించి కూడా నేర్పించింది ఆయనే” అని తెలిపింది. ”విశ్వరూపం, ఉత్తమ విలన్, విశ్వరూపం 2” చిత్రాల్లో కమల్‌తో కలిసి పూజా కుమార్ నటించింది.

Related posts