telugu navyamedia
సినిమా వార్తలు

ఈ స్టార్ హీరో సినిమాలకు గుడ్ బై చెప్పనున్నాడా ?

Shah-Rukh-Khan

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న ఈ షారూఖ్ ను ఇటీవల కాలంలో వరుసగా ఫ్లాపులు పలకరిస్తున్నాయి. షారుఖ్ చివ‌రిగా “జీరో” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. ప్రస్తుతం షారూఖ్ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. రాకేష్ శ‌ర్మ బ‌యోపిక్, సాహిర్ లుథియాన్వి బ‌యోపిక్ వంటి క్రేజీ ప్రాజెక్టులు షారుఖ్ వద్దకు వచ్చాయి. ఇటీవలే షారుఖ్ తాను ప్ర‌స్తుతానికి సినిమాలు చేయాల‌ని అనుకోవ‌డం లేదని, తన కుటుంబంతో మ‌రింత స‌మ‌యం గ‌డ‌పాల‌ని అనుకుంటున్నానని తెలిపారు. ఇదంతా పైకి చెప్పే కారణమైతే లోపల మరో కోణముందుంటున్నారు బాలీవుడ్‌ జనాలు. షారూఖ్‌ సినిమాలకు గుడ్‌బై చెప్పి తన వారసులుగా కొడుకు, కూతురును తెర మీదకు తేవాలని నిర్ణయించుకున్నారట. అందుకే సినిమాలు మానేసి వారిని హీరో హీరోయిన్లుగా తీర్చిదిద్దే పనిలో బిజీగా ఉన్నారట. ఇప్పటికే బాలీవుడ్ లో స్టార్ హీరోల పిల్లలు ఎంట్రీ ఇవ్వడం, హిట్ అందుకోవడం చూస్తూనే ఉన్నాము. త్వరలోనే షారుఖ్ వారసులు కూడా ఎంట్రీ ఇస్తారన్నమాట.

Related posts