telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హిందీ “బిగ్ బాస్-14” పిక్స్ వైరల్

Bigg Boss-14

పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ 14 కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ఈ షో అక్టోబర్ 3న ప్రసారం కానుంది. అక్టోబర్ 1న ప్రసారం కానున్న ప్రోమో కోసం ముంబైలోని ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా బిగ్ బాస్ 14 హౌజ్ కు సంబంధించిన కొన్ని చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో బెడ్ రూమ్, హాల్ , కిచెన్, వాష్ రూమ్ ఏరియాలతో పాటు అద్భుతమైన డెకార్స్ ఉన్నాయి. ఈ ఫోటోలు అధికారికమైనవి కానప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క‌రోనా నేప‌థ్యంలో అన్ని జాగ్ర‌త్త‌ల మ‌ధ్య షోని ముందుకు తీసుకెళ్లేందుకు యూనిట్ సిద్ధ‌మైంది. మ‌రోవైపు ఈ సీజ‌న్‌లో ఎవ‌రెవ‌రు పాల్గొంటారన్న విష‌యంపై ఇప్ప‌టికే పలు వార్త‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. జాస్మిన్ భాసిన్, అలీ గోని, జాన్ కుమార్, శుభంగి ఆత్రే, కరణ్ పటేల్, నిశాంత్ మల్కాని, ఐజాజ్ ఖాన్., రాహుల్ వైద్య, నిక్కి తాంబోలి, షాగున్ పాండే, పవిత్ర పునియా, నైనా సింగ్ పేర్లు ప్రముఖంగా విన్పిస్తున్నాయి. ఇంత‌కుముందు సీజన్ లాగా కాకుండా ఈసారి మాత్రం షో కొంచెం భిన్నంగా ఉంటుంద‌ని నిర్వాహ‌కులు తెలిపారు.

Related posts