telugu navyamedia
తెలుగు కవిత్వం సామాజిక

పీత కష్టాలు

prema pakshulai poetry corner

ఈ సృష్టిలో అల్ప ప్రాణి ఐన పీతకూ కష్టాలే
ఉత్క్రుష్ట జన్మ ఐన మనిషికీ కష్టాలే
ఎవరికి తగిన రీతిలో వారికి
కష్టాలు ఉంటాయి
అని చెప్పడానికే
పీత కష్టాలు పీతవి సీత కష్టాలు సీతవి అని సామెత
మాటలు నేర్చిన మనిషి తన కష్టాలు ఇతరులతో చెప్పుకొని కొంత స్వాంతన పొందుతాడు
నోరులేని మూగ జీవాలు ఎవరితో చెప్పుకుంటాయి
ఎలా సేద దీరుతాయి
భువిపై పుట్టిన ప్రతి జీవి కష్టాల కడలిని ఈదుతూ తన గమ్యాన్ని చేరుకోవలసిందే
పేదవాడికి తిండి లేక బాధపడితే
ధనికుడు తిన్న తిండి అరగక బాధపడతాడు
డబ్బులేక జీవితాన్ని గడపలేక
అలాగని తనువు చాలించలేక ఎందరో
డబ్బు ఎక్కువై ఏమి చేయాలో తెలియక
అలాగని పేదవారికి పంచె మనస్సు లేక ఎందరో
అందరినీ మోస్తున్న భూమాతకు కూడా కష్టాలే
మంచి వారికీ చోటిచ్చి
దుష్టులనూ బ్రతకనిస్తున్న ఆ భూదేవి కి ఎంత కష్టమో
జన్మించిన ప్రతి జీవి తన జీవిత భారాన్ని మోయక తప్పదు
వచ్చే సుఖ,దుఃఖాలను కష్ట,నష్టాలను అనుభవించక తప్పదు
ఏది ఏమైనా కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికీ ఆ దేవుడిచ్చిన ఫలాలు
ఆ ఫలాలను తింటూనే మన బ్రతుకు బండిని లాగక తప్పదు
అది మనిషికైనా ,అల్ప ప్రాణికయినా
*******
పత్తిపాటి రూపలత
తిరుపతి

Related posts