ఐపీఎల్ 2021ను వాయిదా వేయాలని రెండు వారాల క్రితమే తాను సూచించానని షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 14వ సీజన్ మధ్యలోనే ఆగిపోతుందని తనకు ముందే తెలుసన్నాడు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ 2021ను బీసీసీఐ మంగళవారం నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్ 2021 వాయిదా వేయడంపై పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ స్పందించాడు. ఓ వీడియో పోస్ట్ చేసి అందులో మాట్లాడాడు. ‘ఐపీఎల్ 2021 నిరవధికంగా వాయిదా పడింది. ఇలా అవుతుందని నాకు ముందే తెలుసు. రెండు వారాల క్రితమే వాయిదా వేయాలని బీసీసీఐకి సూచించాను. భారత్‌లో ప్రస్తుత కరోనా సంక్షోభంలో మనుషుల ప్రాణాలు కాపాడటం కన్నా.. మరేదీ ముఖ్యం కాదు’ అని అక్తర్ ట్వీట్ చేశాడు. ఐపీఎల్ రద్దవ్వడంతో మిగిలన 31 మ్యాచ్‌లు నిర్వహించే అవకాశాల కోసం బీసీసీఐ ఆలోచిస్తుంది. కరోనా ఉధృతి తగ్గితే.. సెప్టెంబర్‌లో మ్యాచ్‌లు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఆక్సిజన్ కొరతతో సతమతమవుతున్న భారత్‌కు సహాయచేద్దామని తన యూట్యుబ్ చానెల్ వేదికగా అక్తర్ పాక్ ప్రజలను ఇదివరకే కోరాడు.
previous post
ప్రభుత్వ ప్రకటనలో అన్ని అబద్ధాలే.. జగన్ పై లోకేశ్ విమర్శలు