telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు

ఎలక్ట్రానిక్ రంగంలోకి పేస్ బుక్…

facebook logo

పేస్ బుక్ ఎలక్ట్రానిక్ రంగంలోకి ప్రవేశించేందుకు సిద్ధం అయ్యింది. పేస్ బుక్ నుంచి వాచ్ లను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.  గతేడాది పేస్ బుక్ సంస్థ రేబాన్ కంపెనీతో కొలాబరేట్ అయ్యి స్మార్ట్ కళ్లజోళ్లను రిలీజ్ చేసింది.  ఇప్పుడు పేస్ బుక్ స్మార్ట్ వాచ్ లను కూడా రిలీజ్ చేయాలని సంకల్పించింది.  ఈ వాచ్ లు స్మార్ట్ ఫోన్ తో కనెక్టివిటీ అయ్యి ఉంటాయని పేస్ బుక్ చెప్తున్నది.  అయితే, ఈ వాచ్ లు ఆండ్రాయిడ్ ఆధారంగా పనిచేస్తుందా లేదంటే ఐఓఎస్ ఆధారంగా పనిచేస్తుందా అన్నది స్పష్టం చేయలేదు.  లేదా సొంతంగా కొత్త టెక్నాలజీతో తయారు చేస్తుందా అన్నది కంపెనీ పేర్కొనలేదు.  2019లో పేస్ బుక్ సంస్థ సిటీఆర్ఎల్ కంపెనీని కొనుగోలు చేసింది.  వైర్ లెస్ ఇన్పుట్ మెకానిజంతో వ్యవస్థ కలిగిన ఈ కంపెనీ మెదడు నుంచి వచ్చే ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ఆధారంగా ఆపరేట్ చేసే డివైజ్ లను తయారు చేస్తుంది.  ఈ టెక్నాలజీని స్మార్ట్ వాచ్ లో వినియోగించాలని పేస్ బుక్ చూస్తున్నది.  ఒకవేళ ఈ టెక్నాలజీని వినియోగించి స్మార్ట్ వాచ్ లను పేస్ బుక్ తయారు చేస్తే నూతన శకానికి నాంది పలికినట్టే అవుతుంది. చూడాలి మరి ఈ వాచ్ లు ఇప్పటివరకు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి అనేది.

Related posts