నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ నిత్యం ఏదో ఒక రూపంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఈ లాక్‌డౌన్ వేళ ఆపదలో ఉన్నవారికి చేతనైన సాయాన్ని అందిస్తూ మానవత్వాన్ని చాటుకున్న ఈమె.. తాజాగా మహిళలపై జరుగుతున్న గృహ హింస దాడులపై స్పందించింది. మహిలు దీనిపై సమిష్టిగా యుద్ధం చేయాల్సిన అవసరముందని పేర్కొంది. ఈ మేరకు ఓ ఫోటో పోస్ట్ చేస్తూ మహిళలంతా తన లాగే ఫోటో పోస్ట్ చేస్తూ నిరసన తెలపాలని కోరింది. ”ఈ లాక్‌డౌన్ పీరియడ్‌లో మహిళలపై గృహ హింస దాడులు పెరగడం అందరం చూసాం. ఇది రోజురోజుకు శృతిమించిపోతోంది. దీనిపై మౌనంగా ఉండటం సరికాదు. . దీనిపై అందరికీ అవగాహన కల్పించాలి. బాధితురాళ్లను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది. అంతా కలిసి ఓ రిపోర్ట్ రెడీ చేయాలి. ఇలాంటి వాటిపై ఫిర్యాదు చేయాలంటే 181 లేదా జాతీయ మహిళా కమిషన్ నెంబర్ 7217735372కు వాట్సప్ చేయండి. అలాగే #ActAgainstAbuse ఉద్యమంలో పాల్గొని మద్దతు తెలిపేందుకు నోరు, కళ్లు, చెవులు మూసుకుని ఉన్న ఫోటోను ఈ హ్యాష్ ట్యాగ్‌తో పోస్ట్ చేయండి” అని పేర్కొంటూ ట్వీట్ చేసింది వరలక్ష్మి శరత్ కుమార్. ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ‘క్రాక్’ చిత్రంలో నటిస్తోంది.
previous post
next post