రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం లో నేటి నుంచి సౌర వెలుగు లు విరజిమ్మనున్నాయి విమానాశ్రయ అవసరాల కోసం ఏర్పాటు చేసిన సౌర విద్యుదుత్పత్తి ప్లాంట్ ఇవాళ్టి నుంచి అందుబాటు లోకి రానుంది. ప్లాస్టిక్ నిషేధం తో పర్యావరణ హితమైనది గా గుర్తింపు పొందిన విజయవాడ విమానాశ్రయం రాష్ట్రం లో సౌర విద్యుత్తు వినియోగించే తొలి విమానాశ్రయం గానూ గుర్తింపు సొంతం చేసుకోనుంది. రాజధాని అమరావతి ప్రాంతం లో భాగమయ్యాక గన్నవరం విమానాశ్రయం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అంతర్జాతీయ హోదా రావడం సహా నూట అరవై కోట్ల రూపాయల వ్యయంతో అధునాతన దేశీయ టెర్మినల్ అందుబాటు లోకి వచ్చింది. ప్రయాణికుల రాకపోకలు క్రమంగా పెరగడం తో విద్యుత్ వినియోగం పెరిగింది విమానాశ్రయం లో రన్ వే టెర్మినల్ భవనాలు సిగ్నలింగ్ వ్యవస్థ సహా అన్ని అవసరాలకు ఇప్పటి వరకు సాధారణ విద్యుత్ నే వినియోగిస్తున్నారు. ఇందు కోసం ఇరవై నాలుగు గంటలు విద్యుత్ సరఫరా ఉండాలి ఎప్పుడైనా సరఫరా లో అంతరాయం ఏర్పడితే ఎనిమిది సెకన్ లలోనే మళ్లీ విద్యుత్ అందించి జనరేటర్ లు ఉపయోగిస్తున్నారు.
ఏసీల వాడకం ఎక్కువే కావడం తో కరెంటు చార్జి లు తడిసి మోపెడవుతున్నాయి విద్యుత్ డిమాండ్ ను అందుకోవడం సహా సౌర విద్యుత్ ను పెద్ద ఎత్తున వినియోగిస్తూ పర్యావరణ పరిరక్షణ లో భాగం కావాల ని భారత విమానయాన సంస్థ యోచించింది. తదనుగుణంగా గన్నవరం విమానాశ్రయ ప్రాంగణం లో ఆరు ఎకరాల స్థలం లో ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్లాంటును గతేడాది డిసెంబర్ లో ప్రారంభించారు. సౌర విద్యుత్ ప్లాంటు నిర్మాణ పనులను ఇక్కడి అధికారులు వేగంగా పూర్తి చేశారు. దేశం లోని వివిధ విమానాశ్రయాల్లో పనులు కొనసాగుతుండగా ఇక్కడ మాత్రం ప్లాంట్ ను అందుబాటు లోకి తీసుకొచ్చారు.