పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల నుంచి తప్పుకోవాలని నవయుగ కంపెనీకి ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. నిపుణుల కమిటీ నివేదిక మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు నిర్మాణ వ్యయ అంచనాలను పెంచారని జగన్ సర్కారు భావిస్తోంది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఏపీ ప్రభుత్వానికి కేంద్రం షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
ఈ ప్రాజెక్ట్ కు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఎందుకు రద్దు చేయకూడదని ప్రశ్నించింది. పోలవరం దాని అనుబంధ ప్రాజెక్టులపై కేంద్ర పర్యావరణ శాఖ తనిఖీలు జరిపించింది. తనిఖీల అనంతరం చెన్నై పర్యావరణ శాఖ అధికారులు సంబంధింత నివేదికలను కేంద్రానికి అందజేశారు. అదేవిధంగా పురుషోత్తపట్నం ప్రాజెక్టుపైనా కేంద్రం వివరణ కోరినట్టు సమాచారం.