డికె శివ కుమార్ రాజీనామా చేసిన ఎంఎల్‌ఎ లను కలిసేందుకు ముంబై కు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ రక్షణ లోపం వచ్చే ప్రమాదం ఉండటంతో, ఆయనను ఎమ్మెల్యేలను కలిసేందుకు అనుమతించలేదు. దీనితో ఆయన అక్కడే ఉండిపోయారు. రోడ్డు పై భోజనం చేస్తూ.. జ్యూస్ లు తాగుతూ హోటల్ బయటే ఎదురు చూస్తున్నారు. వాళ్ళని కలిస్తేగాని కదలనని బీష్మించుకు కూర్చుండటంతో .. చేసేదిలేక ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తమకు ప్రాణ హాని ఉందని రెబల్ ఎంఎల్‌ఎ లు ఫిర్యాదు చేయడంతో.. శివ కుమార్ ను హోటల్ లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. శివ కుమార్ తో తమకు ప్రాణ హాని ఉందని 10 మంది ఎమ్మెల్యేలు లేఖ రాసిన నేపథ్యంలో.. ముంబై లో రెబల్ ఎమ్మెల్యే ఉన్న హోటల్ వద్ద డికె శివ కుమార్ సహా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆ వ్యాఖ్యల పై సాధ్వి క్షమాపణలు చెప్పాలి: జీవీఎల్