telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

తన గురువు‌ ట్వీట్ పై వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్

KTR

మంత్రి కేటీఆర్ ఎప్పుడు‌ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు అనే విషయం అందరికి తెలుసు. ఏ సమస్య ఆయన దృష్టికి వచ్చినా.. వెంటనే స్పందిస్తారు.. సంబంధితులను అలర్ట్ చేస్తారు. వీలైనంత త్వరగా సహాయం అందేలా చర్యలు తీసుకుంటారు.. ఇక, హైదరాబాద్‌లో భారీ వర్షాలు, వరదలపై కూడా సోషల్ మీడియా వేదికగా ఆయనకు విజ్ఞప్తులు వస్తూనే ఉన్నాయి.. తాజాగా.. కేటీఆర్‌ హస్కూల్‌లో చదువుతున్న సమయంలో ఆయన గురువు, లలితానగర్‌ అడిక్‌మెట్‌ రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అయిన సత్యనారాయణ ట్విట్టర్‌ వేదికగా మంత్రికి ఓ విజ్ఞప్తి చేశారు.. భారీ వర్షాలకు అడిక్‌మెట్‌ డివిజన్‌ లలితానగర్‌లో డ్రైనేజీ ఓవర్‌ ఫ్లో అవుతోంది. వరద నీరు పోటెత్తుతోందని.. కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్‌.. ఆ సమస్యను పరిష్కరించాలని ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు సూచించారు. ఆయన అధికారులతో కలిసి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.. సమస్య ఎలా పరిష్కరించాలన్నదానిపై ప్రణాళికలు రూపొందించారు. ఇలా.. సోషల్ మీడియా వేదికగా తన గురువు చేసిన విజ్ఞప్తికి మంత్రి కేటీఆర్ ఓ స్కూల్ స్టూడెంట్ లాగా వెంటనే స్పందించారు.

Related posts