తన ఇంటి ప్రహరీని కూల్చడంపై మాజీ ఎంపీ సబ్బం హరి అధికారులపై మండిపడ్డారు.ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై నిప్పులు చెరిగారు. తానేంటో ముఖ్యమంత్రి జగన్ కు తెలుసనీ, విజయసాయికి తన గురించి తెలియదనుకుంటానని హరి అన్నారు.
విశాఖలో కూర్చొని ఏదో చేద్దామనుకుంటే సాధ్యమయ్యే విషయం కాదని చెప్పారు. విశాఖలో డ్యాన్స్ చేద్దామని అనుకుంటున్నారని, ఆయన డ్యాన్స్ ని కట్టిస్తానని విజసాయిపై పరోక్ష విమర్శలు చేశారు. తన గురించి తెలియక ఏదో చేద్దామనుకుంటున్నారని అన్నారు. ఈ తప్పు ఎందుకు చేశానా? అని బాధ పడే స్థాయికి తీసుకెళ్తానని చెప్పారు. ఇది లీగల్ గా వెళ్లేంత పెద్ద విషయం కాదని చెప్పారు. 24 గంటల్లో సమస్యను క్లోజ్ చేస్తానని తెలిపారు.