telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“సరిలేరు నీకెవ్వరు” అన్పిస్తున్న టీజర్ రికార్డు

SN

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’‌. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో సీనియర్‌ హీరోయిన్‌ విజయశాంతి నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. మ‌హేశ్ న‌టిస్తోన్న 26వ చిత్ర‌మిది. ఈ సినిమా టీజ‌ర్ శుక్ర‌వారం విడుద‌లైంది. ఈ టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి హ్యుజ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమా టీజ‌ర్ సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. విడుద‌లైన కొన్ని గంట‌ల్లోనే ఈ టీజ‌ర్‌కు 12 మిలియ‌న్ వ్యూస్ ద‌క్కాయి. అలాగే టీజ‌ర్ విడులైన 18 నిమిషాల్లో 100K లైక్స్‌ను రాబట్టుకుంది. ఈ సినిమాలో మహేష్ బాబు మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో కన్పించనున్నారు. దిల్‌రాజు, మహేష్ బాబు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Related posts