telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మహారాష్ట్ర నాటకీయ పరిణామాలపై బాలీవుడ్ ప్రొడ్యూసర్ కామెంట్స్

Ashok

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నెల్లాళ్ల తరువాత భారతీయ జనతాపార్టీ ఈరోజు ఉదయం ఎన్సీపీతో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దేవేంద్ర ఫడ్నవీస్ మరోమారు మాహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే అజిత్ పవార్ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. దీనిపై పలువురు ప్రముఖులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్ అశోక్ పండిట్ తన స్పందన వెలిబుచ్చారు. ట్విట్టర్ వేదికగా ఆయన ‘సీఎం అయినందుకు దేవేంద్ర ఫడ్నవీస్‌కు, ఉపముఖ్యమంత్రి అయినందుకు అజిత్ పవార్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. రాజకీయాల్లో పరిపక్వత ఎంత అవసరమనేది ఇది రుజువు చేస్తోంది’ అని పేర్కొన్నారు.

Related posts