telugu navyamedia
రాశి ఫలాలు

అక్టోబర్6(బుధవారం) రాశి ఫలాలు

మేషం: ఉద్యోగులకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనులు నెరవేరుతాయి. వివాహ ప్రయత్నాలకు అనుకూలం. గతంలో తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. వృత్తి, వ్యాపారాల వారికి కాలం కొద్దిగా అనుకూలంగా ఉంది. ఆరోగ్యం బాగుంటుంది.

వృషభం: నిరుద్యోగులకు అనుకూలం. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఒక ముఖ్యమైన ఆర్థిక సమస్య పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఖర్చులు తగ్గించుకోండి.

మిథునం: అధికారుల నుంచి సహకారం లభిస్తుంది. కుటుంబంతో సరదాగా కాలక్షేపం చేస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి సమయం అనుకూలం. ఆరోగ్యం బాగుంటుంది.

కర్కాటకం: వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. కొత్తవారు పరిచయమవుతారు. వ్యాపారులు కాస్తంత శ్రమ పడాల్సి ఉంటుంది. ఒక శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగొలు చేస్తారు.

సింహం : ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఇంటా బయటా పని ఒత్తిడి తగ్గుతుంది. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

కన్య: ఉద్యోగులకు అనుకూలం. ఆదాయం నిలకడగా ఉంటుంది. త్వరలో శుభకార్యం జరిగే సూచనలున్నాయి. మీ స్తోమతకు మించి మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఆరోగ్యం మెరుగు పడుతుంది.

తుల: ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులకు కళ్లెం వేయాలి. నిరుద్యోగులకు అనుకూలం. వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. చిన్న వ్యాపారులు లాభాలార్ణిస్తారు.

వృశ్చికం: నిరుద్యోగులకు కాలం అనుకూలం. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోండి. కుటుంబ సభ్యులతో సరదా గా గడుపుతారు. సంఘంలో మంచిపేరు సంపాదిస్తారు.

ధనుస్సు: ఉద్యోగులకు అనుకూలం. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. వ్యాపారులు, వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. ఆరోగ్యం జాగ్రత్త. మొహమాటలకు పోవద్దు.

మకరం: ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోండి. వివాహ ప్రయత్నం ఫలిస్తుంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభ వార్తలు వింటారు. ఆరోగ్యం జాగ్రత్త. ఉపయోగకరమై న నిర్ణయాలు తీసుకుంటారు.

కుంభం: ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులకు అనుకూలం. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. బంధువులు సహాయపడతారు. వ్యాపారులు లాభాలు గడిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త.

మీనం: ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. ఖర్చులు బాగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా నడుస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

Related posts