telugu navyamedia
వార్తలు సామాజిక

భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్

ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి దక్కింది. సంక్లిష్టమైన భౌతిక వ్యవస్థలపై విశ్లేషణలకు గాను జార్జియో పారిసి, సుకురో మనాబే, క్లాస్ హసిల్మన్‌కు సంయుక్తంగా నోబెల్‌ బహుమతి వరించింది. అమెరికాలోని ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయంలో సుకురో మనాబే సీనియర్‌ వాతావరణ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. వాతావరణంలో పెరిగిన కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు భూఉపరితలంపై ఉష్ణోగ్రతల పెరుగుదలకు ఎలా దారితీస్తాయనే విషయంపై చేసిన పరిశోధనకుగాను నోబెల్‌ బహుమతి వరించింది.

జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఫర్ మెటరాలజీ యూనివర్సీటిలో ప్రొఫెసర్ క్లాస్ హసిల్మాన్ పనిచేస్తున్నారు. వెదర్‌ అండ్‌ క్లైమెట్‌కు సంబంధించిన మోడల్‌ను రూపొందించినందుకుగాను నోబెల్‌ బహుమతి లభించింది. అస్తవ్యస్తమైన సంక్లిష్ట పదార్థాలలో దాచిన నమూనాలను కనుగొన్నందుకు రోమ్‌లోని సపియెంజా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జార్జియో పారిసికి నోబెల్ బహుమతి దక్కింది. సంక్లిష్ట వ్యవస్థల సిద్ధాంతానికి అతని ఆవిష్కరణలు చాలా ముఖ్యమైనవి.

ఆరు విభాగాల్లో ఇచ్చే నోబెల్ పురస్కారాల్లో ఇది రెండోది. మెడిసిన్‌ విభాగంలో 2021 గాను డాక్టర్‌ డేవిడ్‌ జూలియస్‌, డా. అరర్డెం పటాపౌషియన్‌లకు ఉమ్మడిగా నోబెల్‌ బహుమతిని రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ప్రకటించిన విషయం తెలిసిందే. తెలిసిందే. నోబెల్ అవార్డు కింద బంగారు పతకం, 11 లక్షల డాలర్లు అందచేస్తారు. నగదు పురస్కారంలో సగం జార్జియో పారిసికి, మరో సగం సుకురో మనాబే, క్లాస్ హాసిల్మన్‌కు అందించనున్నారు.

Related posts