telugu navyamedia
సినిమా వార్తలు

రౌడీ బాయ్స్ సాంగ్ రిలీజ్‌..

ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు సోదరుడు తనయుడు ఆశిష్‌ హీరోగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇతను నటిస్తోన్న చిత్రం ‘రౌడీ బాయ్స్‌’. కాలేజ్ బ్యాక్‌డ్రాప్ నేపథ్యంతో ఆశిష్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ ఈ సినిమా రాబోతుంది.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన‌ టీజ‌ర్‌, టైటిల్ సాంగ్ ప్రేక్షకులను ఆసక్తి పెంచారు. తాజాగా ఈ సినిమానుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటను రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ విడుదల చేశారు.

దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాకి బడ్జెట్ కూడా భారీగానే పెట్టినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది..త్వ‌ర‌లోనే విడుద‌ల కాబోతున్న‌ట్లు తెలుస్తోంది.

Related posts