telugu navyamedia
రాశి ఫలాలు

ఆగస్టు 12 (గురువారం) రాశి ఫలాలు

మేషం : మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. బుద్ధి బలంతో కీలక సమస్యను పరిష్కరించుకుంటారు. ఆదాయం బాగుంటుంది. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. బంధువుల రాకపోకలు ఉంటాయి. వ్యాపారులకు అనుకూలం. ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.

వృషభం: ఆర్థికంగా బాగుంటుంది. చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. సామాజిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారులు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.

మిథునం: చేపట్టిన పనులు కష్టంమీద పూర్తి చేస్తారు. ఆదాయంతో పాటు ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఉద్యోగం మారడానికి ఇది సమయం కాదు. గతంలో నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభిస్తారు. వ్యాపారులకు అనుకూలం.

కర్కాటకం: కీలక పనుల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. తలపెట్టిన పనులు పూర్తిచేస్తారు. మిత్రుల సహాయం ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. వ్యాపారులకు అనుకూలం.

సింహం: ఉద్యోగ, వ్యాపారాల్లో ఒత్తిడి పెరుగుతుంది. వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. విదేశాల నుంచి ఉద్యోగానికి సంబంధించిన సమాచారం వస్తుంది. తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి.

కన్య: ఆర్థికంగా బాగుంటుంది. సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. దగ్గరి బంధువులను ఆదుకుంటారు. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. లాయర్లకు, సామాజిక కార్యకర్తలకు అనుకూలం. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఉద్యోగంలో అనుకూల సమాచారం అందుతుంది. ఉత్సాహంగా కాలం గడుపుతారు.

తుల: ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయం పెరుగుతుంది. చిత్తశుద్ధితో చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. సోదరులతో సఖ్యతగా ఉండండి. తోటివారి సహాయం ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే సూచనలు. వ్యాపారులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా లేవు.

వృశ్చికం: ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. రియల్ ఎస్టేట్ వారికి, స్వయం ఉపాధివారికి అనుకూలం. చిత్తశుద్ధితో చేసే పనులు త్వరగా విజయం అందిస్తాయి. బంధువుల నుంచి ఒత్తిడి ఉంటుంది. గిట్టని వారితో తక్కువగా మాట్లాడండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి.

ధనుస్సు: ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. స్థాన చలనానికి అవకాశం. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. రుణ విముక్తులయ్యే ప్రయత్నం చేస్తారు. చేపట్టిన పనులు ప్రణాళికాబద్దంగా పూర్తిచేస్తారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆర్థిక లావాదేవీలకు సమయం కాదు. శుభవార్తలు వింటారు.

మకరం: ఆర్థికంగా బాగుంటుంది. కొంతవరకు అప్పులు తీరుస్తారు. మొదలుపెట్టిన పనులు కష్టంమీద పూర్తి చేస్తారు. శుభకార్యాలకు అవకాశం. తోటి ఉద్యోగుల సహకారం ఉంటుంది. బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారులకు నిలకడగా ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.

కుంభం: ఉద్యోగానికి సంబంధించి మంచి అవకాశం వస్తుంది. అధికారుల సహాయంతో ఒక పని పూర్తిచేస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండాలి. వ్యాపారులకు ఆర్థికంగా బాగుంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. మనోబలం తగ్గకుండా చూసుకోండి.

మీనం: తల పెట్టిన పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం. బంధు మిత్రులను కలుపుకునిపోతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొన్ని ఘటనలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపారులకు ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఒత్తిడిని తగ్గించుకోవాలి.

Related posts