telugu navyamedia
రాశి ఫలాలు

సెప్టెంబర్ 7(మంగళవారం) రాశి ఫలాలు

మేషం :. బంధు మిత్రుల రాకపోకల వల్ల గృహంలో సందడి వాతావరణం నెలకొంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఖర్చులు తగ్గించురకోండి. ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దు.

వృషభం : రాదనుకున్న డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. ఉద్యోగానికి, ఆదాయానికి సంబంధంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఎక్కడా ఎవరికీ హామీలు ఉండవద్దు. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు. చెడు స్నేహాలకు వీలైనంత దూరంగా ఉండండి.

మిథునం : ప్రైవేటు సంస్థలలోని వారికి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు అధికారులతో ఏకీభావం కుదరదు. సిమెంట్, ఐరన్, కలప, ఇటుకు వ్యాపారస్తులకు కలిసివస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది.

కర్కాటకం : ఉయోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. వివాహ ప్రయత్నాలకు అనుకూలం. విద్యార్థులకు క్రీడలు, ప్రేమ వ్యవహారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది పలుకుబడిగలవారితో పరిచయాలు ఏర్పడుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త.

సింహం : కృషి పట్టుదలతో అన్ని పనులు పూర్తి చేస్తారు. మీ కుటుంబీకుల గురించి గొప్ప గొప్ప పథకాలు వేస్తారు. ఏదైనా విలువైన స్థిరాస్తి అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. వివాహ ప్రయత్నాల అనుకూలం. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

కన్య : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి బాగుంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యక్తిగత సమస్య పరిష్కరించుకుంటారు.

తుల : ఆదాయం బాగుంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. పెద్దలతో మంచి పరిచయాలు ఏర్పడుతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

వృశ్చికం : ఆర్థిక లావాదేవీలు, సమర్థంగా నిర్వహిస్తారు. వ్యాపారులకు మిశ్రమంగా ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అభివృద్ధికి బాటలు వేస్తారు. విద్యార్థులకు ఒత్తిడి పెరుగుతుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. శుభవార్తలు వింటారు. వివాదాలకు పోవద్దు.

ధనుస్సు : ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తత అవసరం. ఇతరుల సహాయం అందుతుంది. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. అలసట వివాహ సంబంధాలకు అనుకూలం. వ్యాపారులకు అనుకూలం.

మకరం : ఆదాయంతో పాటు ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం. శుభవార్తలు వింటారు. స్థిరాస్తి అమ్మకం వాయిదా వేయడం మంచిది. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. ప్రయాణాలకు అవకాశం. ఎవరికీ హామీలు ఉండొద్దు.

కుంభం : ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారులకు అనుకూలం. చేపట్టిన పనులు కష్టంమీద పూర్తి చేస్తారు. స్నేహితుల సహకారం ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

మీనం : ఆర్థికంగా బాగుంటుంది. వృత్తి వ్యాపారాలకు అనుకూలం. చేప్టటిన పనుల్లో ఆటంకం ఎదురైనా పట్టుదలతో పూర్తిచేస్తారు. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. స్నేహితులతు సరదాగా గడుపుతారు. ప్రయాణాలకు అవకాశం. ఎవరికీ హామీలు ఉండొద్దు.

Related posts