telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు వార్తలు సామాజిక

రాశిఫలాలు : … వ్యాపారాలు విస్తరిస్తాయి.. అనుకోని ప్రయాణాలు…

today rasi falalu

మేషం : పనుల్లో ప్రతిష్ఠంభన. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.

వృషభం : చిత్రవిచిత్ర సంఘటనలు. వస్తులాభాలు. పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక ప్రగతి. కొన్ని వివాదాల పరిష్కారం. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో మరింత అనుకూలత.

మిథునం : పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ముందడుగు.

కర్కాటకం : శ్రమ పెరుగుతుంది. అనుకున్న పనుల్లో ప్రతిష్ఠంభన. ఆస్తి వివాదాలు. విద్యార్థులకు కొంత నిరాశ. ఆరోగ్యభంగం. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో ఆటంకాలు.

సింహం : వ్యవహారాలు మందగిస్తాయి. ఆస్తుల వివాదాలు. సోదరులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. నిర్ణయాలు వాయిదా. వ్యాపారాలలో నిరాశ. ఉద్యోగాలలో ఇబ్బందులు.

కన్య : ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

తుల : పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. చర్చలు సఫలం. విందువినోదాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

వృశ్చికం : మిత్రులతో వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో మార్పులు.

ధనుస్సు : అనుకున్న పనులు మందకొడిగా సాగుతాయి. మిత్రులు, బంధువులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. శ్రమాధిక్యం. నిర్ణయాలలో మార్పులు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో నిరుత్సాహం.

మకరం : వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. వాహనయోగం. భూలాభాలు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. దైవచింతన. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు.

కుంభం : ఆస్తి వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం.

మీనం : చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. ఆహ్వానాలు అందుతాయి. వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో సత్తా చాటుకుంటారు.

Related posts