telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు వార్తలు సామాజిక

రాశిఫలాలు : .. ఆటంకాలు ఎదురైనా ముందడుగు వేయండి.. విజయం మీదే..

today rasi falalu

మేషం : ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మీ సహోద్యోగుల లేదా పై అధికారుల ప్రశంసలు పొందుతారు. మీపై గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కానీ పదోన్నతి విషయంలో శుభవార్త కానీ వింటారు. మీ జీవిత భాగస్వామితో ఉన్న వివాదాలు సమసిపోతాయి.

వృషభం : ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కళ్లు లేదా దంతాలకు సంబంధించిన అనారోగ్యం బారిన పడే అవకాశముంటుంది. పని ఎక్కువ ఉండటం వలన అసహనానికి, ఉద్రేకానికి గురయ్యే అవకాశముంటుంది. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఏ నిర్ణయమైనా ఒకటికి రెండు సార్లు ఆలోచించి తీసుకోవటం మంచిది.

మిథునం : ఈ రోజు చాలా ఆహ్లాద కరమైన రోజు. ఇష్టమైన వారితో ఎక్కువ సమయం గడుపుతారు. బంధుమిత్రులను కలుసుకోవటం. వివాహాది శుభకార్యాల్లో పాల్గొనటం చేస్తారు. అలాగే పాత మిత్రులను కలువటం జరుగుతుంది. మీ ప్రేమను వ్యక్తం చేయటానికి అనువైన రోజు. బహుమతులు అందుకుంటారు. మీరు చేసిన పనికి గుర్తింపు వస్తుంది.

కర్కాటకం : ఈ రోజు అనుకున్న పనులు తక్కువ శ్రమతో పూర్తి అవుతాయి. చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్న విషయంలో శుభవార్త వింటారు. మీ లక్ష్యం నెరవేరుతుంది. ధన లాభం కలుగుతుంది అలాగే రుచికరమైన భోజనం చేస్తారు. మీ స్నేహితులను కలుసుకుంటారు. గృహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి. ఉద్యోగంలో ఉన్నతి సాధిస్తారు.

సింహం : ఈ రోజు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ఆహారం కారణంగా ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు వచ్చే అవకాశముంటుంది. అలాగే నిద్రలేమి కారణంగా మానసిక ప్రశాంతత ఉండదు. అలసట, నీరసం అధికంగా ఉంటాయి. అనుకోని ప్రయాణం చేయాల్సి వస్తుంది. వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. వాహన కొనుగోలు చేస్తారు.

కన్య : ఈ రోజు మీ సహోద్యోగులతో, పై అధికారులతో సుహృద్భావముతో మెలగండి. వారితో గొడవలకు దిగటం మంచిది కాదు. అలాగే వారు చెప్పిన దానిని శ్రద్ధగా విని ఆచరించటానికి ప్రయత్నించండి. కోపావేశాలకు లోనవటం వలన అనవసర సమస్యలకు గురయ్యే అవకాశముంటుంది. పనులు పూర్తయ్యే సమయంలో వాయిదా పడటం కాని, ఆగిపోవటం కాని జరుగుతుంది.

తుల : ఈ రోజు మీ జీవిత భాగస్వామితో, పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వారితో కలిసి వినోద యాత్ర చేసే అవకాశముంది. ఖర్చు అధికంగా ఉంటుంది. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు. వ్యాపార ఒప్పందాలు పూర్తి చేయటం కానీ, నూతన వ్యాపారం ఆరంభించటం కానీ చేస్తారు. వ్యసనాల జోలికి వెళ్లి డబ్బు నష్టపోకండి.

వృశ్చికం : ఈ రోజు తలపెట్టిన కార్యములు విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. దాని కారణంగా సమాజంలో గౌరవాన్ని, గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో మార్పు కానీ, పదోన్నతి కానీ ఉంటుంది. విదేశీ యానానికి సంబంధించి కానీ, పెట్టుబడికి సంబంధించి కానీ ఒక శుభవార్త వింటారు. మీ జీవితభాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

ధనుస్సు : ఆర్థికంగా కొంత ఇబ్బందిని కలిగించే రోజు. ధన నష్టం కానీ, అనవసరమైన ఖర్చు కానీ ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలమైన రోజు కాదు. ఎవరికి కూడా డబ్బు విషయంలో మాట ఇచ్చి ఇబ్బంది పడకండి. ఆర్థిక నియంత్రణ అవసరం. సంతానం వృద్ధిలోకి వస్తారు. వారి కారణంగా ఆనందం పొందుతారు.

మకరం : ఆరోగ్య విషయంలో ఈ రోజు కొంత జాగ్రత్త అవసరం. కడుపు నొప్పి కానీ, ఛాతిలో మంటతో కానీ బాధ పడే అవకాశముంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. బయటి భోజనం చేయకండి. అలాగే మీ కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం కూడా మీకు ఆందోళన కలిగించే అవకాశం ఉన్నది.

కుంభం : ఈ రోజు ఆర్థికంగా కలిసి వస్తుంది. పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. అలాగే మొండి బకాయిలు వసూలవుతాయి. భూ సంబంధ లావాదేవీలు చేస్తారు. కుటుంబ సభ్యుల సహాయ, సహకారాలు అందుతాయి. ప్రయాణాల్లో అనుకోని వ్యక్తులను కలుసుకుంటారు. మీ ఆలోచనలను కార్యరూపంలో పెడతారు.

మీనం : ఈ రోజు పనుల్లో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. ఆటంకాలు వచ్చినా ప్రయత్నం మానకండి. కొద్ది శ్రమతో వాటిని పూర్తి చేయగలుగుతారు. ఆఫీస్ లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఓపికతో మెలగాల్సిన సమయం. మానసికంగా ఓటమిని ఒప్పుకోకండి, విజయం మీ వశమవుతుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.

Related posts