telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గ్రేటర్‌లో టీఆర్ఎస్ ను కాపాడింది వారేనా..?

TRS flag

గ్రేటర్ ఎన్నికల్లో తెలంగాణ వాసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీకి పట్టంకట్టగా, సీమాంధ్రులు అధికంగా ఉన్న చోట టీఆర్ఎస్ కు జైకొట్టారు. ఇంతకీ సీమాంధ్రులు టీఆర్ఎస్ కు మద్దతు పలకడానికి కారణం ఏమిటి? ఎవరి మీద వ్యతిరేకత ఎవరికి కలిసొచ్చింది? హైదరాబాద్‌లోని సీమాంధ్రులు… బీజేపీకి వ్యతిరేకంగా ఓటేసి టీఆర్‌ఎస్‌కు కచ్చితమైన ఫలితాన్ని ఇచ్చారు. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, వెంగళరావునగర్‌, శ్రీనగర్‌ కాలనీ, బంజారా హిల్స్‌, జూబ్లీహిల్స్‌, కొండాపూర్‌ ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌ ఊహించినదాని కంటే ఎక్కువ సీట్లు కొట్టగలిగింది. 55 సీట్లతో బోర్లాపడిన టీఆర్‌ఎస్‌కి… ఆ మాత్రమైనా సీట్లు వచ్చాయంటే, దానికి కారణం.. ఈ ప్రాంతాలే. శేరి లింగంపల్లిలో 10 స్థానాలు ఉంటే టీఆర్‌ఎస్‌కి 9, బీజేపీకి ఒకటి వచ్చాయి. దీనిని బట్టి హైదరాబాద్‌ సీమాంధ్రులు టీఆర్‌ఎస్‌ ని ఎంతగా సొంతం చేసుకున్నారో ఎంతగా బీజేపీని ద్వేషిస్తున్నారో అర్ధమవుతుంది. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి ఉపాధి, ఉద్యోగాల కోసం హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడిన వాళ్లు నివసించే ప్రాంతాల్లో బీజేపీ గెలిచింది. ఎల్బీనగర్‌, సరూర్‌నగర్‌, ఆర్కేపురం డివిజన్లలో కమలం వికసించింది. ముఖ్యంగా ఎల్బీనగర్‌ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు.

Related posts