telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏబీ వెంకటేశ్వరావు వ్యవహారంపై సుప్రీంలో ఏపీ సర్కారు పిటిషన్!

AB venkateshwar Rao

ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ స్టే ఇవ్వాలని కోరింది. ఈ పిటిషన్ పై జూలై 6 తర్వాత విచారణ జరగవచ్చని తెలుస్తోంది. కాగా, ఏబీ వెంకటేశ్వరావు ఇప్పటికే సుప్రీంలో కేవియట్ దాఖలు చేశారు.

బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ అక్రమాలకు పాల్పడ్డారని, నిఘా పరికరాల కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై వైసీపీ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును ఇంటెలిజెన్స్ చీఫ్ పదవి నుంచి తప్పించింది. ఏబీ తన సస్పెన్షన్ ను సవాల్ చేస్తూ క్యాట్ ను ఆశ్రయించినప్పటికీ అక్కడ ఆయనకు చుక్కెదురైంది. దీంతో ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయగా, హైకోర్టు ఏపీ సర్కారు విధించిన సస్పెన్షన్ చెల్లదంటూ తీర్పు ఇచ్చింది. వెంటనే బాధ్యతలు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Related posts