ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అన్ని రాష్ట్రాలకంటే విభిన్నంగా ఉంటాయి. ముక్యంగా వైసీపీ, టీడీపీల మధ్య రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు విజయసాయిరెడ్డి. చంద్రబాబు చచ్చిన విషసర్పమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి. అంతేకాదు… చంద్రబాబు అరుదైన మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని పేర్కొన్నారు. “ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచినే నెవరికీ భయపడను, నన్నెవరూ భయపెట్టలేరంటూ గింజుకుంటున్నాడు. చంద్రబాబూ… నువ్వో చచ్చిన విషసర్పానివి. నిన్నెవరూ భయపెట్టడం లేదు. అరుదైన మానసిక వ్యాధితో బాధపడుతున్నావు. ఎన్నికల్లో చిత్తుగా ఓడించాక అది మరింత ముదిరింది. కుప్పం వెళ్లిన చంద్రబాబు …ఇది పుంగనూరు, కడప, పులివెందుల కాదు ఖబడ్దారన్నాడు. ఉత్తరాంధ్రకు వచ్చి ఇది రాయలసీమ కాదు మీ ఆటలు సాగవంటాడు. మంచివారు, చెడ్డవారు ప్రాంతాలవారీగా ఉంటారా బాబూ? ప్రాంతాలు, కులాలు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడమే నీ పనా? నీవెక్కడికెళ్లినా పీకేదీమీ లేదు.” అంటూ విజయసాయిరెడ్డి తెలిపారు.
previous post
next post